జాస్తి వీరాంజనేయులు వినతి
ఢిల్లీ, మహానాడు : అమరావతి రాజధానిలో నూతన విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖ అందజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూమి అందుబాటులో ఉందన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయంతో అమరావతికి పెట్టుబడులు సులభంగా వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తప్పకుండా వినతి పత్రాన్ని పరిశీలిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.