- వరంగల్ కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు
- వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పార్లమెంట్ లో ప్రయత్నం చేసిన ఎంపీ డా. కడియం కావ్య
- ఎంపీ డా. కడియం కావ్య కృషితో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం
- ఎంపీ కావ్యకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు
వరంగల్ లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చేసిన ప్రయత్నం ఫలించింది. ఎంపీ డా.కడియం కావ్య కృషి ఫలితంగా వరంగల్ కు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద వెల్నెస్ సెంటర్ మంజూరు అయింది.
సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకొని వరంగల్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య పది రోజులుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఈ వెల్నెస్ సెంటర్ మంజూరు అయింది.
దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్నెస్ సెంటర్ లకు మంజూరు ఇవ్వగా అందులో వరంగల్ కూడా ఉంది. దీంతో ఇప్పుడు వరంగల్ పరిధిలో ఉన్నటువంటి 54 ప్రధాన పట్టణాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలో సదుపాయాల అందించడానికి ఈ వెల్నెస్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందిని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యను పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ చొరవతో మంజూరు కావడం పట్ల ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో ఉన్న వెల్నెస్ సెంటర్ కు వెళ్లడం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి లో ఉన్న వెల్నెస్ సెంటర్ కి వెళ్తున్న ఉద్యోగ కుటుంబాలకు వరంగల్ వెల్నెస్ సెంటర్ ప్రతిపాదన తర్వాత అవకాశాలు మెరుగవుతాయని ఎంపీ పేర్కొన్నారు.
వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉద్యోగ కుటుంబాలకు వైద్య ఆరోగ్య సంబంధిత సౌకర్యం లభిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపి డా. కడియం కావ్యకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.