ఢిల్లీ: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలం గాణలో కనిపిస్తాయని తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణ మని తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.