కేంద్రమంత్రులకు శుభాకాంక్షలు: రేవంత్‌

హైదరాబాద్‌: తెలుగురాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కుమార్‌, కె.రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస వర్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా ఆకాంక్షించారు.