– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి
దొనకొండ, మహానాడు: మొక్కలను పెంచి, పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని డాక్టర్ లక్ష్మి చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన అందించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు వలె ముందుకు తీసుకెళుతున్నారు. కొద్దిరోజుల పాలనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజారంజకంగా పాలన అందిస్తున్నారని తెలిపారు.
ఇందుకు తోడు ప్రకృతి కరుణించింది. వర్షాలు సకాలంలో కురిశాయి. డ్యాంలు నిండాయి. రైతులకు కూడా మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ సీజన్లో భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం ప్రకృతిని పరిరక్షించేందుకు మొక్కల పెంపకాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరారు. ఒక యజ్ఞం వలె ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో మొక్కలు పెంచే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ జన్మించిన మీ బర్తడే జరుపుకున్న ఇలా ఏ వేడుకైనా గుర్తుగా ఒక మొక్క నాటి ఆ మొక్కను మన ఆరోగ్యం కోసం పెంచుకొని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు.
దర్శి నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో, ప్రతి మండల కేంద్రంలో దర్శి పట్టణంలో మొక్కలు పెంచే కార్యక్రమానికి అందరూ శ్రీకారం చుట్టాలని డాక్టర్ లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో దొనకొండ మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వర రావు, దర్శి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు, దొనకొండ గ్రామ సర్పంచ్ కొంగలేటి గ్రేస్ లక్ష్మీ కుమారి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.