Mahanaadu-Logo-PNG-Large

బిడ్డ బెయిల్‌ కోసం గూడు పుఠాణి…

జహీరాబాద్‌లో బీజేపీ గెలుపునకు కేసీఆర్‌ కంకణం
కాలనాగు మోదీ..రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
నారాయణఖేడ్‌కు ఫార్మా విలేజ్‌ తీసుకువస్తా
సురేష్‌ షెట్కర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి
జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బిడ్డ బెయిల్‌ కోసం జహీరాబాద్‌లో కేసీఆర్‌ కంకణం కట్టుకున్నాడని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జహీరాబాద్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. అంగీ మార్చినా.. రంగు మార్చినా బిజినెస్‌ పాటిల్‌ను బండకేసి కొడతారు…కేసీఆర్‌కు చెప్పాకే బీబీ పాటిల్‌ బీజేపీలో చేరారు..బిడ్డ బెయిల్‌ కోసం జహీరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే.. వాళ్లిద్దరిదీ గూడుపుఠాణి అని పేర్కొన్నారు. దొర గడీలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని బంధ విముక్తి కల్పించిన ఘనత మీది. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ప్రజా పాలన కొనసా గించుకుంటున్నాం.

ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుం టున్నాం. డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు మంజూరు చేశాం. ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్‌ పదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు..కానీ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.

కాలనాగు మోదీ…

ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి వారికి దామాషా ప్రకారం అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ది…బీసీ జనగణన చేపడి తేనే వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందుతాయి.. అందుకే బీసీ జనగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించుకున్నామని చెప్పారు.
మేమిద్దరం మాకు ఇద్దరు అన్నట్లు.. మోదీ, అమిత్‌ షాకు ఆదాని, అంబానీ తోడయ్యారు. వాళ్లంతా కలిసి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్‌ జనతా పార్టీ. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది..మోదీ కాలనాగు లాంటి వాడు.

మనసులో పగ పెట్టుకుంటారు. నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై మోదీ పగ పట్టారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను ఆదాని, అంబానీలకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారు. 400 సీట్లు గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటు న్నారు. పదేళ్లు మోసం చేసిన వారికి ఓటేస్తారా..వంద రోజుల్లో మీకు సంక్షేమం అందించిన వారికి ఓటేస్తారా ఆలోచించండి.

సురేష్‌ షెట్కర్‌ను గెలిపించండి

జహీరాబాద్‌ అభివృద్ధి జరగాలంటే నిజాయితీకి మారుపేరు సురేష్‌ షెట్కర్‌ను లక్ష మెజారిటీ తో గెలిపించండి.. ఇంటర్‌ మొదటి, రెండవ, మూడవ ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు రూ.2 కోట్లు ఈ వేదిక నుంచి మంజూరు చేస్తున్నా..ఈ ప్రాంతానికి మహిళా ఐటీఐ ఇచ్చే బాధ్యత నాది..నారాయణఖేడ్‌లో 2 వేల ఎకరాలు సేకరించి ఫార్మా విలేజ్‌ తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తమదని చెప్పారు.