పారిశుద్ధ్య పనుల్లో గుంటూరు అధికారులు, సిబ్బంది

విజయవాడ, మహానాడు: విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మొదలయ్యాయి. 62 వ డివిజన్ పైపుల రోడ్డులో చెత్త తొలగింపు, తరలింపు, మెయిన్ రోడ్ల క్లీనింగ్ చేసినట్టు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని, పైప్ ల రోడ్డు ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో 100 మంది కార్మికులు, 4 మంది కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.