– ముఖ్య అతిథిగా మ్మెల్యే అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు: పట్టణంలోని టౌన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మహాకవి గుర్రం జాషువా 129 వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….గుర్రం జాషువా గొప్ప కవి అని, ఆయన తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పారని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.