ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
వన మహోత్సవంలో పాల్గొన్న జనసేన,టీడీపీ నాయకులు
4,000 మందికి అన్న సమారాధన
విశాఖపట్నం : సెప్టెంబర్ 2, మద్దిలపాలెం కళాభారతి జంక్షన్లో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ అభిమానులు జనసేన జెండా ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువతకు ఆదర్శంగా నిలిచిపోతారని కొనియాడారు. కూటమి కలయికతో జనసేన, బీజేపీ, టీడీపీ విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
పవన్ పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు జనసేన పార్టీ వీర సైనికులు వీర మహిళలు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ సంరక్షణకు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈ ప్రాంతంలో మొక్కలు నాటారు. పర్యావరణానికి రక్షణ కల్పించే విధంగా నేరేడు, అశోక, వేప వంటి మొక్కలను నాటారు.
మద్దిలపాలెం కళాభారతి జంక్షన్లో సుమారు 4,000 మందికి అన్న సమారాధన చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి ప్రజలకు భోజనం వడ్డించారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం 22 వార్డు ప్రెసిడెంట్ బొట్ట రమణ వార్డు సభ్యులు మరియు జనసేన 22 వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వార్డు ప్రెసిడెంట్ పోతిన ప్రసాద్ సభ్యులు జన సైనికులు వీర మహిళలు అభిమానులు పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.