– మంత్రి నారా లోకేష్
అమరావతి, మహానాడు: తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వేజోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకొందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్రప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నానని తెలిపారు.