– ‘వారధి’కి ఫిర్యాదు
విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు వేధింపులకు గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురిచేసిన వైసీపీ ప్రభుత్వం వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం పాలనను గాడిలో పెట్టిందన్నారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వారధి కార్యక్రమానికి ఈ మేరకు ఒక ఫిర్యాదు అందిందని ఎమ్మెల్యే తెలిపారు.
పశు సంవర్ధక శాఖ లో పాడేరు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన వెంకటస్వామికి పది మాసాలుగా జీతం ఇవ్వలేదని ఫిర్యాదు చేసినట్టు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అకారణంగా రాజకీయ నిర్ణయం తీసుకుని జీతం లేకుండా చేశారని మండిపడ్డారు. వచ్చే నవంబరులో రిటైర్మెంట్ ఉందని వెంకటస్వామి కన్నీటిపర్యంతం అయ్యారని, తాను వెంటనే సంబంధిత కార్యదర్శికి, ముఖ్యమంత్రి పేషీ కి జరిగిన సంఘటన వివరించానన్నారు.
ఇంకా.. వారధికి విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో వరదల కారణంగా నష్టపోయిన మహిళలు ప్రభుత్వపరంగా సహకారం అందించే సహకారం అందించాలని మహిళలు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్, తదితరులు పాల్గొన్నారు.