గుంటూరు, మహానాడు: నగరంలోని రాజేంద్రనగర్ వైసీపీ స్థానిక కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన తెనాలి నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి నుండి పార్టీ కమిటీలను, ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు.