-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
-జీవీ, ఎమ్మెల్సీ జంగా, మక్కెన సమక్షంలో టీడీపీలోకి చేరికలు
వినుకొండ, మహానాడు: ప్రవాసాంధ్రులపై జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులు మానుకోవాలని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి తరఫున గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎన్నారైలపై దుష్ప్రచారం చేయడం, కొందరిపై కేసులు పెట్టడం, దాడులకు ప్రయత్నించడాన్ని హేయమైన చర్యలుగా పేర్కొన్నారు. శనివారం వినుకొండ తెలు గుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈపూరు మండలం అగ్నిగుండాల నుంచి 13 కుటుంబాలు, శావల్యాపురం నుంచి 3 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చు కున్నాయి. జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికా ర్జునరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవీ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎన్నారైల చొరవను అభినందించారు.