– కొనుగోలుకు నోచుకోని లక్షాలాది కార్లు
న్యూఢిల్లీ: కార్లకు గడ్డు రోజులు దాపురించాయి. భారత్‌లో లక్షలాది కార్లు కొనుగోలుకు నోచుకోకుండా గోదాంల్లో నిల్వ ఉండిపోయాయి.
దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద ప్రస్తుతం రూ.73,000 కోట్ల విలువైన ఏడు లక్షలకు పైగా అమ్ముడుపోని కార్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) తెలిపింది. జూలై ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న వాహనాల నిల్వ వ్యవధి ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగిందని పేర్కొంది. ‘కొనుగోళ్ళు తగ్గడమే దీనికి కారణం, ఇది డీలర్ స్థిరత్వానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది’ అని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు.