హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ లో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్న 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు శుభాకాంక్షలు.ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు దాటి గౌరవ ప్రదమైన పోలీసు ఉద్యోగంలో చేరుతుండటం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు నిజమైన పండుగ రోజు.
విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా వ్యవహరించి, శాంతి భద్రతలు కాపాడటంలో నిర్విరామ కృషి చేయాలని కోరుతున్నాను.వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
2022 ఏప్రిల్‌లో 17వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్సై పోస్టులు 587. గతేడాది ఆగస్టులోనే ఈ పరీక్షల తుది ఫలితాలు రాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఎస్సై అభ్యర్థులకు శిక్షణ మొదలైంది. ప్రస్తుతం వారు శిక్షణ ముగించుకొని విధుల్లో చేరబోతుండటంతో తెలంగాణ పోలీసు వ్యవస్థ మరింత పటిష్ఠం కానున్నది