Mahanaadu-Logo-PNG-Large

హరీష్‌రావు సిద్ధం…రేవంత్‌తో రాజీనామాకు సిద్ధమా?

నువ్వు ఒక బ్రోకర్‌, జోకర్‌, తాగుబోతు
హౌలా పనులు, హవాలా దందాలకే కేరాఫ్‌
22 మంది ఉన్నారని నాకే నాయబారం పంపావు
కోమటిరెడ్డికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కౌంటర్‌

కరీంనగర్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నార ని, హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రాజీనామా చేయించడానికి సిద్ధమా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హుజురాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ండ్డి సవాల్‌ విసిరారు. శనివారం కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గంలో సబ్జెక్టు లేని సన్నాసి ఎవరన్నా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమేనని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్‌…బ్రోకర్‌…తాగుబోతు అని వ్యాఖ్యానించారు. హౌలా పనులు, హవాలా దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కేసీఆర్‌తో మాట్లాడితే తానే ముఖ్యమంత్రి అవుతానని ఒక వ్యక్తితో స్వయంగా తనకే రాయబారం పంపారని అన్నారు.

అయినప్పటికీ ఆయన మాటలను పట్టించుకోలేదని చెప్పా రు. పార్లమెంటు ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెడితేనే మిగిలిన గ్యారంటీలు అవలవుతాయన్నారు. ఈ సమావేశంలో కేడీసీసీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకర రవిశంకర్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిల్‌ రమేష్‌, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వరరావు, హుజురాబాద్‌ ఎంపీపీ రాణి-సురేందర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ కొండల్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.