Mahanaadu-Logo-PNG-Large

హరిత నిర్మాణాలకు ప్రభుత్వం ప్రోత్సాహం

పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామం
రీజినల్‌, ఔటర్‌ రింగు రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు
గ్రీన్‌ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్‌, మహానాడు : పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్‌ ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్‌ బిల్డింగ్స్‌కు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. సగటు మానవుడు కొనుగో లు చేసే విధంగా గ్రీన్‌ బిల్డింగ్స్‌ నిర్మాణాలు ఉండాలని బిల్డర్లను కోరారు. హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు స్వర్గధామం లాంటి దని అభివర్ణించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం పట్టణ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈ రెండిటి మధ్యలో పరిశ్రమలు పెద్దఎత్తున రానున్నాయన్నారు. నగరం నలుమూ లల మెట్రో రైలును విస్తరించి ఆలోచనలో ఉన్నామని తెలిపారు.