– క్షతగాత్రులను ఆదుకున్న టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి లక్ష్మి
దర్శి, మహానాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి వైద్య సేవలు అందించి, తన వైద్య వృత్తికి వన్నెతెచ్చారు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. వివరాలివి. ఒక శుభకార్యానికి డాక్టర్ లక్ష్మి బుధవారం దర్శి నుండి పోతవరం వెళుతున్నారు. అయితే, ఆ మార్గంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పి.చెన్నకేశవులు(28)కు గాయాలయ్యాయి. క్షతగాత్రుని పరిస్థితికి చలించిన ఆమె, తక్షణం ప్రయాణం ఆపి, ప్రాథమిక వైద్యం అందించారు. అంతేకాకుండా, అదనపు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి, దర్శి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఆమె సేవలను తెలుసుకున్న పలువురు ఆమెను అభినందించారు. కాగా, గాయపడ్డ కేశవులు సాయినగర్ వాసి.