– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడ్లవల్లేరు, మహానాడు: ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని… ప్రభుత్వంపైన, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారిని ప్రార్థించారు. ప్రసిద్ధిగాంచిన వేమవరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రుల గ్రామోత్సవ ఊరేగింపు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఊరేగింపును ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు.
భక్తులతో కలిసి, ఊరేగింపులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. 20వేల మందికి పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు, టీడీపీ నాయకులు కొడాలి రామరాజు, వల్లభనేని వెంకట్రావు, వెనిగండ్ల రామకృష్ణ (నాని), చేకూరు జగన్మోహన్రావు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, పొట్లూరి రవి, కొలా రాధాకృష్ణ, వల్ల భనేని బాబురావు, కన్య భాస్కర్ రావు, నారగాని శ్రీను, కొప్పునేమి పిచెశ్వరావు,గరికిపాటి రాంబాబు, పెన్నేరు రమేష్, దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులు చిట్టిబొమ్మ వీర రాజు, పామర్తి సత్య బాబు, అడపా డీవీఎస్ చంద్ర శేఖర్ బాబు, మన్నెం వీరనరేంద్రరావు, వడ్లముడి పద్మజ, ఈడే వెంకట విష్ణు మోహన్ రావు, కొప్పినేని నాగ వెంకట లక్ష్మి, ఉస్తిల పావని, గుడ్లవల్లేటి వాణి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.