అతనొక్కడే!

1977 లో దారుణంగా ఓడిపోయి 78 లో పార్టీ పోయి..! గుర్తు పోయిన అత్యంత కష్టమైన టైం లో ఈయన ఇందిరా కాంగ్రెస్ లో ఉంటే, అనూహ్యంగా ఆమె మళ్ళీ ప్రధాని అయ్యారు..! అప్పుడే ఆంధ్రాలో రెడ్డి సిండికేట్ పెద్ద నాయకులందరినీ తీసుకుపోతే డిపాజిట్స్ కూడా రావనుకున్న ఇందిరా కాంగ్రెస్ అధికారం చేపట్టింది..ఈయన పోటీ చేసింది ఇందిరా కాంగ్రెస్ లో..! 81 లో ఈయన్ని అల్లుడు చేసుకుంటే, 83 లో అన్నగారు సీఎం అయ్యారు.

84 లో అన్నగారిని బలవంతంగా కుర్చీ దించాక ఈయన వచ్చి వెనక నిలబడితే మళ్ళీ కుర్చీ నడుచుకుంటూ వచ్చింది. 85 లో అర్ధాంతరంగా సభ రద్దు చేస్తే ఈయన పోటీ చెయ్యక పోయినా ఇటు పక్కే ఉన్నారు ఆయన మళ్ళీ సీఎం అయ్యారు. 94లో ఈయన ముందుండి నడిపిస్తే, బొటాబోటిగా గెలిస్తుంది అనుకున్న టీడీపీ, చరిత్ర చూడని సునామీ సృష్టించింది. ఇక దేవేగౌడ..గుజ్రాల్ లాంటి నాయకుల సుడి అయితే చెప్పే పని లేదు.

ఇంకా 13 రోజులకే ప్రభుత్వం కూలిపోయిన వాజపాయి గారి పక్కకు వెళితే వరుసగా రెండు సార్లు పీఎం అయ్యారు. రక్త పిపాసి అని పేరు తెచ్చుకున్న మోడీ పక్కకు వెళితే పూర్తి మెజారిటీ తెచ్చుకున్న మొదటి నాన్ కాంగ్రెస్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మోడీ పక్కన ఉన్నారు.

ఫన్ ఏమిటంటే ఇదే టైం లైన్ లో మహామేత పక్కన ఉన్నోళ్ల పరిస్థితి ఏమైందో కాస్త గుర్తు తెచ్చుకోండి. మా గొప్పోళ్ళు అనుకున్న నీలం..కాసు రెడ్ల దగ్గరనుండి..కాళిక అనుకున్న ఇందిర నుండి.. వావ్ అన్న రాజీవ్ గాంధీ గారి నుండి అబ్బో అనుకున్న ఉమ్మడి ఆంధ్రా వరకు అతని కాలు యాడ బెడితే ఆడ..! అప్పం బప్పం!

– శ్రీనివాసబాబు