Mahanaadu-Logo-PNG-Large

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్నాయి తుంగభద్ర జలాలు. ఇవాళ మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 863.40 అడుగులు ఉన్నాయని చెప్పారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 116.9200 టీఎంసీలు అని తెలిపారు.

కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు వెల్లడించారు అధికారులు. ఇక అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టం 506.60 అడుగులు ఉన్నాయి.