శ్రీశైలం, మహానాడు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. అధికారులు జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులుగా ఉందని, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని వారు తెలిపారు.