శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.. 13 వందల 90 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడికి వద్ద.. బూట్లు, బ్యాగులో బంగారం దొరికిందన్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పట్టుకున్న బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వివరించారు.