రోటీ మేకర్ గా ఎమ్మెల్యే పల్లె సింధూర బిజీబిజీ
టాక్ ఆఫ్ ది పుట్టపర్తిగా హాల్ చల్
(బహదూర్)
ఈ కాలంలో రాగి రొట్టె అంటే సీమ బిడ్డలకు ఇష్ట. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మరీ ఇష్టం . అందుకే గురువారం నియోజకవర్గంలోని ఓడి చెరువు మండల కేంద్రంలోనీ తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు మల్లా పల్లి ఓబుల్ రెడ్డి ఇంటిలో తానే స్వయంగా రాగిరొట్టె తయారుచేసి, పెనం మీద కాల్చి అక్కడి అభిమానులకు రుచి చూపించారు.
రాగి రొట్టె తయారీలో ఎంతో కాలం నుంచి వీటిని తయారు చేసే అనుభవం ఉన్న మహిళలు మాత్రమే చేయగలరు .కానీ ఏ అనుభవం లేదు. పల్లె టూరూ కాదు. చిన్నప్పటి నుంచి వంట మనుషులు ఉండే ఎంతో ఉన్నత కుటుంబం.
కేరళ మాజీ టీజీపీ శంకర్ రెడ్డి కుమార్తెగా పుట్టిన ఈమె ఏనాడు ఏ వంట చేయని ఈ ఎంటెక్ పట్టభద్రురాలు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లె టూరు వంటకాలు నేర్చుకొంటూ అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
రాగి రొట్టె అంటే ఎంతో ఇష్టమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఇలా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాగి రొట్టెతో తన ప్రత్యేకతను చాటుకోవడంతో టాక్ ఆఫ్ ది పుట్టపర్తిగా నిలిచారు