ఇదిగో పౌరసరఫరా శాఖలో అవినీతి..చర్చకు వస్తారా?

-బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌
-సమాధానం చెప్పే ధైర్యం లేక కేసులు పెడతారా?
-జలసౌధాలో మీ అరాచకాలు బయటపెట్టమంటారా?
-ప్రజాప్రతినిధిగా అడుగుతున్నా..భయపడేది లేదు

హైదారాబాద్‌, మహానాడు: పౌరసరఫరా శాఖలో అవినీతిపై కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువా రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరా శాఖలో జరిగి న అవినీతి, అక్రమాలపై మాటాడితే మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశాడు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా ప్రశ్నిస్తే పోలీ సులకు ఫిర్యాదు చేయించి నాపై కేసు పెట్టిస్తారా..ఇదేనా ప్రజాపాలన అని ధ్వజమెత్తారు. జరిగిన అవినీతిపై నేను పూర్తి వాస్తవాలతో చర్చకు సిద్ధంగా ఉన్నాను. చర్చకు వస్తారా అని సవాల్‌ విసిరారు. కాళేశ్వరంపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేయించిన ప్రభుత్వం, సివిల్‌ సప్లయ్‌ శాఖలో జరిగిన అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

సమాధానం చెప్పే ధైర్యం లేదా ఉత్తమ్‌

మంత్రి ఉత్తమ్‌కు మాట్లాడేందుకు సమాధానం లేక అధికారులతో ప్రకటనలు ఇప్పిస్తున్నాడు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా అవినీతిని బయటపెట్టాను. నా ఆరోపణలు, సందేహాలు ఎలా తీరుస్తారో చెప్పకుండా కేసులు పెట్టి మొహం చాటేస్తున్నారు. జగ్గారెడ్డికి ఆ శాఖపై ఏం అవగాహన ఉంటుంది. జనవరి 25న టెండర్ల కోసం కమిటీ వేశారు. గైడ్‌ లైన్స్‌ కూడా ప్రిపేర్‌ చేశారు. అదేరోజు గ్లోబల్‌ టెండర్లకు ప్రకటన ఇచ్చారు. ఒక్క రోజులోనే కమిటీ ఏర్పాటు, మీటిం గ్స్‌, గైడ్‌లైన్స్‌ రూపకల్పన, అదేరోజు టెండర్లకు ప్రకటన ఎలా సాధ్యం. ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్‌ కోసం మరో గైడ్‌లైన్స్‌ తయారు చేశారు. టెండర్లలో పాల్గొనేం దుకు పంజాబ్‌, హర్యానా నుంచి కాంట్రాక్టర్లు ముందుకు వస్తే కొందరు అధికారులు వారిని బెదిరించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగానే ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లోని జలసౌధలో రైస్‌ మిల్లర్లతో సమావేశంలో ఒప్పందాలు చేసుకున్నారు.

మీ అరాచకాలను బయటపెట్టమంటారా?

రూ.216 అదనంగా మిల్లర్ల నుంచి వసూలు చేసింది నిజం కాదా? స్థాయికి మించి అదనపు ధాన్యం మిల్లర్లకు ఇస్తే వారు ఎలా భరిస్తారు. మిల్లర్లు బియ్యం ఇస్తామంటే డబ్బులే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మిల్లర్లతో మీరు బెదిరింపులకు పాల్పడిరది నిజం కాదా? అని ప్రశ్నించారు. జలసౌధాలో మీరు చేసిన అరాచ కాలు బయటపెట్టాలా? ప్రజల కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా భయపడేది లేదు.

కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు

మే 23 లోపు పూర్తి మెటీరియల్‌ లిఫ్ట్‌ చేయాలని టెండర్‌లో కోరారు. పూర్తి ధాన్యం లిఫ్ట్‌ చేయకపోతే బ్లాక్‌ లిస్టులో పెడతామని చెప్పారు. ధాన్యం కొనుగో లులో రూ.800 కోట్ల అవినీతి జరిగింది. నేటితో కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. అయినా కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. మే 23తో గడువు ముగిసి, పూర్తి ధాన్యం కొనుగోలు చేయని బిడ్డర్లకు ఎందుకు ఎక్స్‌టెన్షన్‌ ఇస్తున్నారు. రూ.2259లకు లక్షా 59 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అమ్మేశారు. మధ్యాహ్న భోజనం, హాస్టళ్లలో విద్యార్థుల కోసం అంటూ మళ్లీ ఎందుకు కొంటున్నారు? క్వింటాకు రూ.5700లకు తిరిగి సన్నబియ్యం ఎందు కు కొన్నారు? 22 లక్షల క్వింటాళ్ల బియ్యం కొనుగోలు చేశారు. 10 శాతం నూక ఉన్న బియ్యం ఓపెన్‌ మార్కెట్‌లో రూ.38 రూపాయలకే దొరుకు తుంది. ఇంత వ్యత్యాసంతో ఎందుకు అమ్మారు? ఇప్పుడు ఎందుకు మళ్లీ అధిక ధరకు కొంటున్నారు? సివిల్‌ సప్లయ్‌ శాఖలో ఇలా జరిగిన ఎన్నో అవినీతి, అక్ర మాల పై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మంత్రి గారు చర్చకు వస్తే నిరూపించడాని కి సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు.