అవనిగడ్డ, మహానాడు : అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ని ప్రముఖ హీరోయిన్, హీరో వరుణ్ సందేశ్ సతీమణి వృతిక షేర్ శుక్రవారం దర్శించుకు న్నారు. నాగుపాము పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోపిదేవి గుడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు సాంబశివరావు, ఫోనమాల నాగరాజు, లంకె రాజగోపాల్, కొల్లాటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.