– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, మహానాడు: తిరుమల లడ్డు అపవిత్రతపై మాజీ మంత్రి కొడాలి నాని, వైకాపా నేతల వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు… మూర్ఖపు మాటలు అపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఈ మేరకు గుడివాడ ప్రజా వేదిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియాతో ఏమన్నారంటే… చరిత్ర చూడని వరదల్లో మునిగి గుడివాడ ప్రజలు కష్టపడుతుంటే ఏం అయిపోయారు?
నీచుడు జగన్ చేసిన తప్పును… ఒప్పుగా మార్చేందుకు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని వైకాపా మాజీలు… .అవకాశం దొరగ్గానే మళ్ళీ పిచ్చి మాటలు మొదలెట్టారు. అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతపై…..ప్రజలు బాధలో ఉన్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది… అంతర్జాతీయ ప్రముఖ మీడియా కూడా స్పందించింది. తప్పు జరిగినప్పుడు సరిదిద్దాలి… .కానీ మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. ప్రజలంటే భయంతో గుడివాడ రాకుండా…… తిరుగుతున్నారు. చేతినిండా తాళ్ళు కట్టుకుని ….. జుట్టు పెంచుకుంటే భక్తులు అయిపోరు. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వాలి…. కష్టాలు, బాధలు అర్థం చేసుకోవాలి. వైకాపా ప్రభుత్వంలో ఆంజనేయ స్వామి విగ్రహ చెయ్యి విరిగితే…. బొమ్మ చెయ్యి విరిగితే ఏం అవుతుంది అన్నారు.
రథం దగ్ధం అయితే….మరొకటి చేస్తామన్నారు. పిచ్చి మాటలు మాట్లాడే దరిద్రులకు…. చరిత్రకు ఉండే గొప్పతనం ఏం తెలుస్తుంది. ప్రజలు తిరగబడతారన్న భయంతో…..ధైర్యంగా గుడివాడ కూడా రాని వ్యక్తి….మీడియా ముందు పిచ్చి ప్రేలాపనలు పెలుతున్నారు. మీరు చేతగాని వాళ్లని తప్పించారు.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 11 సీట్లకు పడిపోయిన …. అసెంబ్లీకి కూడా రాని జగన్ ను ప్రజలు మర్చిపోయారు. విజయవాడ వరద ప్రాంతాలకు వెళ్లి మంచితారు రోడ్డు మీద జగన్ తిరిగితే… 24 గంటలు పాటు బాధితులకు అండగా వరద నీటిలో చంద్రబాబు కష్టపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పార్టీ మండల అధ్యక్షుడు వాసే మురళి, నాయకులు గోకవరపు సునీల్ పాల్గొన్నారు.