వైసీపీ అభ్యర్థుల హౌస్‌ అరెస్ట్‌

పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌ రెడ్డి, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పల్నాడులో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా హౌస్‌ అరెస్టులు చేశామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని వివరించారు.