టీడీపీ హయాంలోనే పేదలకు ఇళ్లు

– మంత్రి టీజీ.భరత్

కర్నూలు :  గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి టీజీ. భరత్ అన్నారు. కర్నూలు లోని టిడ్కో గృహ సముదాయల వద్ద నిర్మించనున్న మహిళామార్టు భవనానికి మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తో కలిసి ప్రారంభించారు. తెలుగు దేశం పార్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాలు దాదాపు పూర్తి చేసిన చిన్నచిన్న పనులు పూర్తిచేయ్యలేక లబ్దిదారులకు ఇవ్వలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడ్కో గృహాలు అభివృద్ధి చేసి త్వరలో లబ్దిదారులకు ఇస్తామని ఆయన అన్నారు.