ఆర్థికాభివృద్ది జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది?

Yanamala-Ramakrishnudu-2

– గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు
– 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ అబద్దాలు చెప్తున్నారు
– దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు
– మరి ఈ అప్పులు ఎలా పెరిగాయి?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

జగన్ మోహన్ రెడ్డి 2024 విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మొండీ చేయి చూపించారు. 2019 లో ప్రజలను ఎలా మోసం చేయాలో అనే విధంగా మేనిఫెస్టో రూపొందించి వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. జగన్ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో మార్పు ఏమీ లేదు. పాత హామీల్నే తారుమారు చేశారు. పాతవాటినే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప కొత్త మేనిఫెస్టోలో ఎలాంటి మార్పులు లేవు.

99 శాతం హామీలను అమలు చేశామని అబద్దాలు చెప్పుకోవడమే గానీ, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి చేసిందేమీ లేదు. జగన్ రెడ్డి విడుదల చేసిన హామీలు అతనికి, అతని అనుసరులకు తప్పితే ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేవు. మేనిఫెస్టోలో కొత్తవేమి చేర్చలేదు. కనీసం పాతవి అమలు చేస్తానని కూడా చెప్పలేదు. జగన్ రెడ్డి మేనిఫెస్టోలో మూడు అంశాలు ప్రధానంగా చెప్పారు. దానిలో మొదటిగా రెవెన్యూ డెఫ్సిట్ గురించి చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ది సరిగా జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్ ఆర్ధికాభివృద్ధి గురించి మాట్లాడకుండా రెవెన్యూ డెఫ్సిట్ గురించి మాట్లాడుతున్నారు.

2014-15 లో కూడా రెవెన్యూ డెఫ్సిట్ ఉంది అది కూడా 1.5 మాత్రమే. మనకు జనభా ఎక్కువ కావడం వల్ల, ఖర్చులు ఎక్కువ పెరిగి రెవెన్యూ డిఫ్సిట్ పెరిగిందని ఆనాడు ఫైనాన్స్ కమీషనే చెప్పింది. 2018-19 వచ్చే లోగా రెవెన్యూ డెఫ్సిట్ ‘సున్నా’ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని 2014-19 లోగా ఆదాయ లోటును తగ్గించుకుంటూ వచ్చాం. రెవెన్యూ డిఫ్సిట్ తగ్గించడం వల్ల రాష్ట్ర రెవెన్యూ పెంచుకోగలిగాం. టీడీపీ హయాంలో తగ్గించిన ఆదాయ లోటు ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో విపరీతంగా పెరిగిపోయింది. రెవెన్యూ, ఎక్పెండిచర్ విపరీతంగా పెంచేసి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఇలా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడంలో విఫలమయ్యారు.

రెవెన్యూ ఎక్పెండీచర్ ఎందుకు పెరిగిందనే ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. రెవెన్యూ ఆదాయాన్ని పెంచుకోవడం వల్ల రాష్ట్ర సంపద పెరిగి రాష్ట్రంలో అప్పులు తగ్గుతాయి అనే వాస్తవం జగన్ రెడ్డికి తెలియదా? జగన్ రెడ్డి అడ్వైజర్స్ పేరుకే తప్ప వీటి మీద వారికి ఎలాంటి అవగాహనా లేదు. అందుకే అధికారులందరూ నిమిత్తమాత్రులయ్యారు. కానీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం టీడీపీ హయాంలో రెవెన్యూ డెఫ్సిట్ విపరీతంగా ఉందని అసత్యాలు మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. మరి ఈ అప్పులు ఎలా పెరిగాయి?

2019 లో వైసీపీ అధికారం చేపట్టిన సమయానికి రూ.2 లక్షల 57 వేల ఓపెన్ మార్కెట్ బారెల్స్ ఉంది. 2024 లో అప్పులు చూస్తే 14 లక్షల కోట్లు ఉంది ఈ అప్పులు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్ రెడ్డికి ఉంది. ఫైనాన్షియల్ సిస్టమ్ ని నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డిది. దీనివల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో జగన్ రెడ్డి చెప్పాలి. దోపిడిల్లో, అవినీతి, ఫైనాన్షియల్ డెఫ్సిట్ లో ఆయనకు, ఆయన అనుచరులకు కనీసం ఎబిసిడి లు కూడా తెలియవు. ప్రైమరీ డెఫ్సిట్, రెవెన్యూ డెఫ్సిట్, ఎంతో జగన్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రంలో ఆదాయం, అభివృద్ధి కంటే అప్పులే ఎక్కువగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలపై ఆర్ధిక భారం పడుతుంది.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదరికమే కనబడుతుంది. ఇనిస్టిట్యూట్యూషన్స్ ను నాశనం చేశారు, ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయకుండానే చేశామని డప్పుకొట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బటన్ నొక్కుడే తప్ప దాని వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. నోరు తెరిస్తే జగన్ రెడ్డి డీబిటీ గురించి మాట్లాడతారు. డీబీటిలో ఆంధ్రప్రదేశ్ స్థానం 19 లో ఉంది. ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో చూస్తే ప్రజలకు ఏ విధంగా అభివృధ్ధి ఉపయోగపడేలా లేదు.

తెలుగు దేశం సూపర్ సిక్స్ ద్వారా కొన్ని అంశాలు విడుదల చేయడం జరిగింది. దీనితో పోల్చుకుంటే వైసీపీ మేనిఫెస్టో ఒక శాతం కూడా మీ హామీలు పనిచేయవు. సూపర్ సిక్స్ లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రంలో సమగ్రత కాపాడడానికి, ప్రజల యొక్క సంక్షేమాన్ని, రాష్ట్ర రైతాంగాల శ్రేయస్సును, యువత ఉద్యోగాలు ఇచ్చి ఆదాయాన్ని పెంచడానికి వాళ్లకి ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం ఆర్థిక పరమైన అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నభిన్నమయ్యి అంతా అప్పులు కుప్పలుగా మారింది. ఈ విధంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు.

ఇప్పడు కొత్తగా ప్రజలకు భవిష్యత్తు లేని మేనిఫెస్టో విడుదల చేసి మళ్లీ ప్రజలకు మోసం చేయాలని చూస్తున్నారు. జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో తనకి, తన అనుచరులకు వాళ్ల ఆదాయాల్ని కాపాడుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప ప్రజల ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధి కాపాడే విధంగా ఏ మాత్రం లేదు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా చేయాలని కోరుతున్నా.