Mahanaadu-Logo-PNG-Large

మద్యనిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు?

వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్‌

అమరావతి, మహానాడు : వైసీపీ మేనిఫెస్టో విడుదలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నావు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్య పాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు…ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి ఓట్లు అడుగుతున్నావు? అని ప్రశ్నించారు.