– తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనన్న శీర్షికతో సాక్షి దినపత్రికలో పచ్చి అబద్ధపు కథనం
– గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్న సాక్షి దినపత్రిక యాజమాన్యం
– లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో A3 నిందితుడిగా సాక్షి దినపత్రిక యజమాని
– లాకప్ లో నన్ను చితకొట్టే క్రతువు పూర్తి చేసిన పీవీ సునీల్ కుమార్…
– ప్యాలెస్ లో ఉన్న రుత్వికుడికి వీక్షించే అవకాశం కల్పించాడు
– గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిపై ఒత్తిడి చేసి నివేదిక తారుమారు చేసిన పీవీ సునీల్ కుమార్
– జైలు సూపరింటెండెంట్ నివేదిక లోను నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లుగా వెల్లడి
– ఈ కేసులో ఏ పోలీసు స్టేట్మెంట్ ఇవ్వలేదని పీవీ సునీల్ కుమార్ ఎలా చెబుతాడు?… ఇవ్వలేదని అతనికెలా తెలుసు??
– విజయ్ పాల్ ను పీవీ సునీల్ కుమార్ దాచి పెట్టాడని అందరూ అంటున్నారు
– గూగుల్ టేక్ అవుట్ ఆరు నెలల కంటే ఎక్కువగా అందుబాటులో ఉండవని పీవీ సునీల్ కుమార్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి?
– వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడేళ్ల అనంతరం గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా నిందితుల ఆనవాళ్లను గుర్తించిన సీబీఐ అధికారులు
– వివేకా హత్య కేసులోని గూగుల్ టేక్ అవుట్ అబద్ధమని పీవీ సునీల్ కుమార్ చెప్పాలని చూస్తున్నారా?, లేకపోతే ఆయనకు విషయ పరిజ్ఞానం లేకుండానే ఐపీఎస్ పాస్ అయ్యారా??
– కస్టోడియల్ టార్చర్ కేసులో A1 నిందితుడు ఇంత బరితెగించి మాట్లాడుతున్న ప్రభుత్వం చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటోంది?
– తక్షణమే సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలి
– ప్రభావతిని 164 స్టేట్మెంట్ అడుగుతున్నారంటే… గతంలో 161 స్టేట్మెంట్ ఇచ్చే ఉంటుంది
– 161 స్టేట్మెంట్ చాలు …చూపెట్టిన వారికి, చూసినవారికి తోలు ఊడిపోతుంది
– ముఖ్య నేత ఒత్తిడే ఉండి ఉంటే ఈ కేసులో 3 నెలల క్రితమే పీవీ సునీల్ కుమార్ అరెస్టు అయి ఉండేవారు
– ప్రతిదీ చట్ట ప్రకారం జరగాలని, కేసులో ఎటువంటి జోక్యం చేసుకోకుండా, కక్షపూరితంగా వ్యవహరించని సంస్కారి నారా చంద్రబాబు నాయుడు
– స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కేవలం 15 రోజులు మాత్రమే కాదు… అదొక జీవన విధానమని భావించా
– ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే కాలువల క్లీనింగ్, కాలువ గట్ల ఆక్రమణల తొలగింపునకు ప్రజలతో కలిసి నడుం బిగించా
– నియోజకవర్గంలో స్కూళ్లు, క్రీడా స్థలాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం
– ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు
ఉండి, మహానాడు: జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఎన్ని ట్రిక్కులు వేసిన ఆధారాలతో అడ్డంగా దొరికారని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. లాకప్ లో నన్ను చంపాలని చూసింది పచ్చి నిజం… చితకొట్టింది పచ్చి నిజం… చూపెట్టింది పచ్చి నిజం… చూసినవాడు పచ్చి నిజమని పేర్కొన్న ఆయన, అన్నీ నిజాలేనని దాన్ని కవర్ చేసుకోవడానికి గతంలో అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ను, ఇప్పుడు సాక్షి దినపత్రిక రాయడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనన్న శీర్షికతో సాక్షి దినపత్రిక మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించిన కథనం ద్వారా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయారన్నారు. గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని 164 స్టేట్మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టుగా సాక్షి దినపత్రికలో రాశారని, గతంలో ఆమె 161 స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుందని, అందుకోసమే 164 స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసులు అడిగి ఉంటారన్నారు. 161 స్టేట్మెంట్ చాలని నన్ను లాకప్ లో చిత్రహింసలు పెడుతున్నప్పుడు చూపెట్టిన వారికి, చూసినవారికి తోలు ఊడిపోతుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
ముఖ్యనేత ఒత్తిడే ఉండి ఉంటే… 3 నెలల క్రితమే పీవీ సునీల్ కుమార్ అరెస్ట్ అయి ఉండేవారు
ముఖ్యనేత ఒత్తిడి మేరకే తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు ప్రభావతిని ఒత్తిడి చేస్తున్నారని సాక్షి దినపత్రిక ఒక కట్టు కథనాన్ని రాసిందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ముఖ్యనేత ఒత్తిడి చేసి ఉండి ఉంటే, మూడు నెలల క్రితమే ఈ కేసు లో ప్రధాన నిందితుడైన పీవీ సునీల్ కుమార్ అరెస్టు అయి ఉండేవారని తెలిపారు. ఏది జరిగిన చట్టం ప్రకారం జరగాలి. చట్ట పరిధిలోనే జరగాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
కక్షపూరితంగా వ్యవహరించని సంస్కారి అయిన చంద్రబాబు నాయుడు, ఈ కేసులో ఎటువంటి జోక్యం చేసుకోలేదన్నారు. ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటే పీవీ సునీల్ కుమార్ అరెస్ట్ అయి ఉండేవారన్నారు. దాన్ని లీనియస్ గా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షి దినపత్రిక తన కథనంలో రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా కాలికి అయిన గాయాలను చూసి మిలటరీ ఆసుపత్రి నివేదిక ఆధారంగానే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే కేసులు పెట్టారన్న సాక్షి కథనంపై కూడా రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పీవీ సునీల్ కుమార్ ఉన్నప్పుడు నేను ఫిర్యాదు చేసి ఉంటే ఏమి చేసేవారని… కేసు క్లోజ్ చేసి ఉండేవారని పేర్కొన్నారు. ప్రభావతి సరైన నివేదిక ఇచ్చిందన్న సాక్షి కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నేను న్యాయ పోరాటం చేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
అయితే ఏడాది తర్వాత సుప్రీం కోర్టు, హైకోర్టుకు వెళ్లమని సూచించిందని గుర్తు చేశారు. హైకోర్టులో ఎప్పటికప్పుడు కేసు వాయిదా వేశారు. సీబీఐ అధికారులు తాము బిజీగా ఉన్నామని చెప్పేవారు. అంతలోని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత , రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రభుత్వం ఏర్పడి, నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ముఖ్యనేత ఒత్తిడి ఉండి ఉంటే… 30 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు ?
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నా కస్టోడియల్ టార్చర్ పై నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముఖ్య నేత ఒత్తిడి ఉండి ఉంటే, పోలీసులు 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్య నేత ఒత్తిడి లేదు కాబట్టే నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు.మూడు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముంబైలో ఉన్న సినీనటి కాదంబరి జత్వాని ని ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ఎత్తుకొచ్చారని గుర్తు చేశారు. కాదంబరి జత్వానీ అక్కడ ఎవరినోమోసం చేసిందని, ఇక్కడ ఎవరినో మోసం చేసిందని సాక్షి దినపత్రిక ఎలా రాస్తుందని ప్రశ్నించారు. నేరం రుజువయ్యే వరకు ఆమె నేరస్తురాలు కాదన్న రఘురామకృష్ణంరాజు, పంజాబ్ లో ఎవరో అమిత్ సింగ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారని రాయడం విడ్డూరంగా ఉందన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ ను ఇప్పటికీ నిందితుడిగా మాత్రమే సంబోధిస్తున్నామని, నేరస్తురని పేర్కొనడం లేదని గుర్తు చేశారు. ఇక్కడ తాము ఇంత మంచిగా భాషను ప్రయోగిస్తూ ఉంటే, సాక్షి దినపత్రిక అడ్డగోలు రాతలు రాస్తోందని మండిపడ్డారు .
సునీల్… నీకు ఆ అవకాశం రాదమ్మా…
కస్టోడియల్ టార్చర్ కేసులో సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఈనాడు దినపత్రిక రాసిన ప్రత్యేక కథనాన్ని ప్రూవ్ చేయాలని, లేకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా కేసు పెడుతానని ఇన్ డైరెక్ట్ గా పీవీ సునీల్ కుమార్ బెదిరించడానికి ప్రస్తావిస్తూ నీకు కేసు వేసే అవకాశం రాదమ్మా అని రఘురామ కృష్ణంరాజు సెటైర్ వేశారు. కేసు ప్రూవ్ కాకుండా ఉండే అవకాశం లేదు. ఒకవేళ కేసు ప్రూవ్ కాకపోయినా నీకు కేసు పెట్టి అవకాశమే లేదు. కస్టోడియల్ టార్చర్ కేసులో అన్ని సాక్షాలు పక్కా గా ఉన్నట్టుగా ఈనాడు దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈనాడు దినపత్రిక ఒక వార్తా కథనాన్ని ప్రచురించిందంటే, వారు అన్ని నిర్ధారించుకున్న తరువాతే ప్రచురిస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతిని పీవీ సునీల్ కుమార్ ఎంతగానో ప్రభావితం చేశారు. 12 గంటల లోపు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిద్ధం చేసిన నివేదికను చూసి హడలిపోయిన పీవీ సునీల్ కుమార్, ప్రభావతి పై ఒత్తిడి చేసి నివేదికను తారుమారు చేయించారు.
జగన్మోహన్ రెడ్డి మెడికల్ కౌన్సిల్ లో నియమించిన ఇద్దరు రెడ్ల సహకారంతో, స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఒక దొంగ నివేదికను ప్రభావతి చేత తయారు చేయించిన పీవీ సునీల్ కుమార్, కోర్టుకు సమర్పించారు. జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికలో నాకు పెయిన్ కిల్లర్లను ఇచ్చినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. సాక్షులను పీవీ సునీల్ కుమార్ బెదిరిస్తున్నారు. ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని సునీల్ కుమార్ పేర్కొనడం పరిశీలిస్తే, ఏ పోలీసు స్టేట్మెంట్ ఇవ్వలేదని పీవీ సునీల్ కుమార్ కు ఎలా తెలుసో చెప్పాలని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
అంటే పోలీసులతో పీవీ సునీల్ కుమార్ నిరంతరాయంగా సంబంధాలను కొనసాగిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ కేసులో కీలక నిందితుడైన విజయ్ పాల్ ను పీవీ సునీల్ కుమార్ దాచి పెట్టారని అందరూ అంటున్నారు. ఎక్కడ దాచి పెట్టారో, అతడికే తెలియాలి. పోలీసుల్ని బెదిరించడం, పోలీసులు వాంగ్మూలాన్ని ఇవ్వలేదని పేర్కొనడం పరిశీలిస్తే ఈ కేసులో పీవీ సునీల్ కుమార్ పాత్ర స్పష్టమవుతుందన్నారు.
గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు కేవలం ఆరు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పీవీ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మూడేళ్ల అనంతరం గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా సీబీఐ అధికారులు నిందితుల ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిపారు. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని పీవీ సునీల్ కుమార్ ఎలా ఐపీఎస్ పాసయ్యాడో అర్థం కావడం లేదని విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ లెక్కన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో లభించిన గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు నిజమైనవి కాదని పీవీ సునీల్ కుమార్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో A1 నిందితుడిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ బరితెగించి మాట్లాడుతున్న ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే పివి సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయాలని కోరారు. సాక్షులను బెదిరిస్తూ, ప్రభావితం చేస్తున్న వ్యక్తిని విధుల్లో నుంచి సస్పెండ్ చేసి, అరెస్టు చేసి విచారించాలన్నారు.
నా కాలికి అయిన గాయాలను చూసే మెజిస్ట్రేట్ రెండో ఆసుపత్రిలో చూపించమని ఆదేశించలేదా?
కస్టోడియల్ టార్చర్ వల్ల నా కాలికి అయిన గాయాలను చూసి మెజిస్ట్రేట్ రెండో ఆసుపత్రిలో చూపించమని ఆదేశించలేదా? అంటూ రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అప్పటి సూపరింటెండెంట్ ప్రభావతి గైనకాలజిస్టని గుర్తు చేశారు. మగవాడినైనా తనను గైనకాలజిస్ట్ ప్రభావతి ఎలా పరీక్షిస్తుందని ప్రశ్నించారు. ఆర్థోపెడిషియన్ చేత పరీక్షలు చేయించాల్సి ఉండగా, గైనకాలజిస్ట్ అయినా ప్రభావతి పరీక్షలు చేయడం ఏమిటంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రభావతి ఇచ్చిన నివేదికను పీవీ సునీల్ కుమార్ పూర్తిగా మార్చి వేశారన్నారు. జైల్లో రఘురామకృష్ణం రాజు తనకు తానే హింసించుకొని ఉండవచ్చునని పేర్కొన్న పీవీ సునీల్ కుమార్, మిలటరీ ఆసుపత్రికి వెళ్లే దారిలో గాయపరచుకొని ఉంటారని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు.
పోలీసు వాహనంలో తనని వెళ్ళమని మెజిస్ట్రేట్ ఆదేశించలేదని, సొంత సెక్యూరిటీతో సొంత వాహనంలోనే వెళ్ళేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. తన సొంత వాహనంలో ఏ ఆర్ ఎస్ ఐ ని వెంటబెట్టుకుని మిలటరీ ఆసుపత్రికి పరీక్షల కోసం వెళ్లినట్లుగా గుర్తు చేశారు. పరీక్షల కోసం వెంటనే మిలటరీ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించడంతో, దారిలోనే వాహనాన్ని గుద్ది చంపాలని వీరు ముందే వేసుకున్న ఎత్తుగడ పారలేదన్నారు.
పీవీ సునీల్ కుమార్ క్రిస్టియన్ అనడానికి ఆధారాలున్నాయి
పీవీ సునీల్ కుమార్ క్రిస్టియన్ అనడానికి ఆధారాలు ఉన్నాయని, గతంలో ఈ ఆధారాలన్నింటిని హోం మంత్రిత్వ శాఖకు, డి ఓ టి పి కి తాను అందజేశానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా జగన్మోహన్ రెడ్డి సహకారంతో పీవీ సునీల్ కుమార్ అందరినీ మేనేజ్ చేశారని అన్నారు. ఉద్యోగం సంపాదించడానికి పీవీ సునీల్ కుమార్ ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉండి ఉంటారని తెలిపారు. క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ సర్టిఫికెట్ పొందిన వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని గతంలో ఖమ్మంలోనూ, ఇటీవల కర్నూల్ లోనూ రద్దు చేసినట్టు తెలిపారు.
చట్టసభల ప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్యుడు గతి ఏమిటి?
చట్టసభల ప్రతినిధికే ఈ పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి గతి ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ తరహా ఘటనలలో న్యాయం జరగకపోతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ కేసులో చార్జి షీట్ దాఖలు చేస్తే ఏం జరిగిందో కోర్టు చెప్పాలన్న ఆయన, తన వెంట ఉన్న ఎస్ఐ కి ఏం జరిగిందో తెలుసునన్నారు.
పవన్ కల్యాణ్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమల లో డిక్లరేషన్ ఇవ్వాలి
పవన్ కల్యాణ్ తన కూతుళ్ల తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు కూతురి తరుపున డిక్లరేషన్ ఇచ్చినట్టుగానే, జగన్మోహన్ రెడ్డి కూడా డిక్లరేషన్ ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. పవన్ కల్యాణ్ పెద్దమనిషి తరహాలో తన కూతురు బాప్టిజం తీసుకుందని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేసే విధంగా డిక్లరేషన్ ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని అందరికీ తెలుసునని తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి పై తనకు నమ్మకం ఉందని చాటుకునే అద్భుత అవకాశాన్ని అవగాహన లేమి, అహంకారంతో పోగొట్టుకున్నారన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించే పవన్ కల్యాణ్ తన కూతురు బాప్టిజం తీసుకుందని, తల్లి మతాన్ని ఆచరిస్తుందని నిజాయితీగా చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మళ్లీ శ్రీవారి నుంచి పిలుపు వస్తే డిక్లరేషన్ ఇచ్చి భగవంతుని దర్శించుకోవాలని సూచించారు.
రాజకీయాల కోసం అడ్వాంటేజ్ తీసుకొని మహోన్నత వ్యక్తిత్వం చంద్రబాబు సొంతం
ఏ అవకాశం వచ్చిన రాజకీయాల కోసం ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకొని మహోన్నత వ్యక్తిత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతమని రఘురామకృష్ణం రాజు తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయవొద్దని న్యాయస్థానాలు చెబుతాయని పేర్కొన్నారు. అదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీం కోర్టులో వాదనలను జరిగిన తీరు చూసి ఇల్లు అలకగానే పండుగ జరిగిందన్నట్టుగా వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలను చేస్తోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు మరోసారి సమావేశం కానుందని తెలిపారు.
లడ్డు కల్తీ వ్యవహారం పై సిట్ విచారణ చేస్తోందన్న ఆయన, లడ్డూలో నాణ్యత తగ్గిన మాట అందరికీ తెలిసిందేనన్నారు. లడ్డు ప్రసాదాన్ని చూసి గత కొంతకాలంగా భక్తులు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. సత్యాన్వేషణలో భాగంగా తెలిసిన విషయాన్ని చెప్పకపోతే దోషమని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, గతంలో తప్పులు జరిగాయని ఇప్పుడు అంతా సజావుగానే ఉందని, ప్రాయశ్చిత్తంగా సంప్రోక్షణ చేసినట్లుగా వెల్లడించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదని, ఆయన ప్రతిదీ ఆచితూచి మాట్లాడుతారని చెప్పారు.
స్వచ్ఛతా హీ సేవా 15 రోజుల కార్యక్రమం కాదు
స్వచ్ఛతా హీ సేవా 15 రోజుల కార్యక్రమం కాదని అదొక జీవన విధానంగా ఆచరించాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయకముందే ఉండి నియోజకవర్గంలో కాలువల క్లీనింగ్, కాలువ గట్ల ఆక్రమణను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కాలువలలో మురుగునీరు కలవకుండా, కాలువ గట్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 15 రోజుల కార్యక్రమం కాదని, ఐదేళ్ల పదవీ కాలానికి కొనసాగించాలనే భావనతో ముందస్తుగానే ఉండి నియోజకవర్గంలో చేపట్టినట్టు తెలిపారు. కాలువ గట్ల వెంట నివాసాలు ఏర్పరచుకున్న వారికి గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉండకపోతే, స్థానిక ఎమ్మార్వో తో మాట్లాడి ఇప్పించే విధంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రజలంతా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఆక్రమణల వల్లే బుడమేరు విజయవాడను ముంచెత్తిందని పేర్కొన్న ఆయన, బాధితులను ఆదుకునేందుకు ప్రజలు, పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడుని చూసే విరాళాలను అందజేశారన్నారు. తాము అందజేసే ప్రతి రూపాయి బాధితులకు అందుతుందన్న నమ్మకం, చంద్రబాబు నాయుడు పట్ల విశ్వాసమే 500 కోట్ల రూపాయల విరాళాలను తెచ్చి పెట్టిందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. కాలువలపై ఆక్రమణలను తొలగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ పిలుపు ఇవ్వడంతో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయాన్ని ఆశించకుండా ఉండి నియోజకవర్గ పరిధిలో కాలువల క్లీనింగ్, గట్ల ఆక్రమణల తొలగింపు, రోడ్డు కిరువైపులా గ్రీనరీ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణం, క్రీడా స్థలాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రజల సహకారంతో అందరికంటే ముందుగానే చేపట్టి, ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.