– సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్
– శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్: హడావుడి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా, హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా?
కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు కేసిఆర్ హడావుడిగా వస్తే బాగుండేది.బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేది.
కెసిఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారు.కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు చెబితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి హడావుడిగా బయటకు వెళ్లి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్. ఈ బడ్జెట్లో అన్ని రంగాలకు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాము.