– మంత్రి నారాయణ
విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం చేసిందని, ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్ లు, వాటర్ ప్యాకెట్లు చేరుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 2లక్షల ప్యాకెట్ల ఆహారం ఉదయం టిఫిన్ కోసం పంపించాం. 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా బాధితులకు పంపిణీ కోసం పంపించాం. గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, రాజహేంద్రవరం మున్సిపాలిటీల తో పాటు హరే కృష్ణ మూవ్ మెంట్, పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధ్యతలు అప్పగించాం. మొత్తం 6 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 6 లక్షల వాటర్ బాటిళ్ళు పంపిణీ చేస్తున్నాం. ఆహారం తో పాటు అరటిపండ్లు, ఇతర ఫ్రూట్స్ పంపించాం. వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడలోనే ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తోంది.