– గోరంట్ల రవి కుమార్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
విజయవాడ, మహానాడు: వాయుగుండం ప్రభావంతో విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు పోటెత్తడంతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాయం కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు ఒంగోలులోని శ్రీ హర్షిని విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ స్పందించారు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గోరంట్ల రవికుమార్ కలిశారు. వరద బాధితుల సహాయార్థం శ్రీ హర్షిని విద్యాసంస్థల తరపున 10 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన గోరంట్ల రవికుమార్ ను సీఎం, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అభినందించారు.