రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్
అమరావతి, మహానాడు : తాను ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ప్రత్యక్ష బాధితుడినని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా విన్నకోటలో పట్టా భూముల మ్యూటేషన్‌కు ఇబ్బందిపడినట్లు వెల్లడిర చారు. చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూముల మ్యూటేషన్‌కు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. పోస్టు ద్వారా ఆర్డీవో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి చ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్లు ఏపీకి సేవలందించిన నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ ఆయన ట్వీట్‌లో వెల్లడిరచారు.
ఇక సామాన్యుడి సంగతేంటి?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్
అమరావతి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ చేసిన ట్వీట్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రీ ట్వీట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడినంటూ రమేష్ చేసిన ట్వీట్‌ను వివరించారు. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామా న్యుడి పరిస్థితి ఊహించండి అంటూ రమేష్ చేసిన ట్వీట్‌ను షేర్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదని స్పష్టం చేశారు.
