విజయవాడ: రైలులో ప్రయాణించే వాళ్లు ఇకపై టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ వేరే ఏ కారణాలతో ఐనా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి సదరు గుర్తింపు కార్డులు చూపించకపోతే టికెట్ కొననట్టే పరిగణించి చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ అధికారులు హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా టికెట్ల బదిలీలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.