వైౖసీపీ డబ్బు పంచితే…కూటమికి ఓట్లేశారు

రూ.5 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
విదేశాల నుంచి జగన్‌ ఇక తిరిగి రాడు
రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఎంజాయ్‌ చేస్తున్నాడు
ఈవీఎంలను మార్చొచ్చు..ఈసీ జరజాగ్రత్త
పోస్టల్‌ బ్యాలెట్లు 99 శాతం కూటమికే..
తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌

తిరుపతి, మహానాడు : సీఎం జగన్‌పై తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు. డబ్బులు వైసీపీ నేతలు పంచితే ఓట్లు మాత్రం కూటమికి పడ్డాయని పేర్కొన్నారు. గెలుపు కోసం వైసీపీ నేతలు రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారు..ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిం చి జగన్మోహన్‌రెడ్డి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన జగన్‌ ఇక ఆంధ్రప్రదేశ్‌కు తిరిగిరాడని వ్యాఖ్యానించారు. పోస్టల్‌ బ్యాలెట్లు 99 శాతం కూటమికి పడ్డాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్‌ను ఆస్కార్‌కు ఎంపిక చేయాలన్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీ అభ్యర్థి 80 కోట్లు పెట్టాడు…గూడూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని రూ.45 కోట్లు డీఎస్పీ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.4 వేలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా విఫలమైందన్నారు. ఈవీఎంలను మార్చే అవకాశం ఉందని, ఈసీ జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.