Mahanaadu-Logo-PNG-Large

పనులు అడిగానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా

జగన్‌ కుక్క బిస్కెట్లకు ఆశపడి నాపై దుష్ప్రచారం
తండ్రిపైనే చార్జిషీటు వేయించిన కొడుకు ఉంటాడా?
అవినాష్‌లా అర్ధరాత్రి గొడ్డలితో వెళ్లడం మాకు చేతకాదు
ఊసరవెల్లులు…అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు
పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు

కడప, మహానాడు : నేను వెయ్యి కోట్లు పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఇలా మాట్లాడే వాళ్లు జగన్‌ పడేసే కుక్క బిస్కెట్లకు ఆశ పడే వాళ్లని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి మండిపడ్డారు. కడపలో ఆమె సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో తనపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పనులు అడిగానని అంటున్న వారికి ముందు తనపై మాట్లాడుతున్నందుకు ఎంత అందుతున్నాయో చెప్పాలని నిలదీశారు. వెయ్యి ఏంటి రూ.10 వేల కోట్ల వర్క్‌ అడిగానని కూడా చెబుతారు. నేను ఒక్క పైసా సాయం అడగలేదు..నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపో తానని సవాల్‌ విసిరారు. వీళ్లు ఊసరవెల్లులు…అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారు. తల్లి విజయమ్మ పై సైతం నిందలు వేశారు. ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్‌ మరణం వెనుక రిలియన్స్‌ హస్తం ఉందని ఇదే జగన్‌ అన్నాడు. అందరు నమ్మి ఆ సంస్థపై దాడులు కూడా చేశారు.

కేసుల్లో కూడా ఇరుకున్నారు. సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారు. వివేకా హత్య తర్వాత సీబీఐ విచారణ అడిగారు. సీఎం అయ్యాక విచారణ వద్దన్నారు. అప్పుడొక మాట… ఇప్పుడొక మాట. వైఎస్‌ పేరును పోన్నవోలుతో చార్జిషీట్‌లో పెట్టించి ఆయనకు అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారు. సొంత తండ్రిపై చార్జిషీట్‌ వేయించిన కొడుకు ఎక్కడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు. నా భర్త అనిల్‌పై అవినాష్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్‌ క్రూజర్‌లో వెళ్లి కలిశాడట. ఆయన లాగా అర్ధరాత్రి గొడ్డలితో వెళ్లడం మాకు చేతకాదు అని కౌంటర్‌ ఇచ్చారు. అనిల్‌ కలవలేదు. మీరు రుజువు చేయలేదు. అనిల్‌కు ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని హితవుపలికారు.