Mahanaadu-Logo-PNG-Large

భూమిని మింగాలనుకుంటే.. అదే మింగేసింది!

దురాశే నిండా ముంచేది !

మానవునికి ఎంత భూమి అవసరం అనే సందేహం ఒక మహారాజుకు కలిగింది !
ఇక ఆయన వెంటనే దగ్గరలో ఉన్న జగనయ్య అనే అతన్ని పిలిచి ” నీవు సుఖంగా జీవితం గడపటానికి ఎంత భూమి అవసరమోతెలుసుకోగోరు తున్నాను . రేపు ఉదయం బయలు దేరి సాయంకాలం లోగా ఎంత భూమి కావలయునో అంత భూమిని చుట్టి రావాలి …దాన్ని నీకు ఇచ్చేస్తాను ” అని అన్నాడు

ఇక జగనయ్యలో ఆశ ఎడా పెడా చెలరేగి పోయింది .అతడు తనకూ, తన వంశీయులకు సరిపడే విశాల ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలని వాంఛించాడు. మరునాటి ఉదయం 13 వ తేదీన పరుగెత్తటం ప్రారంభించాడు.

చాలా పెద్ద వర్తులం చేస్తున్నాడు. పరిగెత్తుతూనే ప్రణాళిక మీద ప్రణాళిక రచిస్తున్నాడు. మొత్తం భూమి తన టైటిల్ మీదే వుండాలనే తహ తహ తో , మైళ్ళ కొద్దీ పరుగెత్తి తుదకు గమ్య స్థానం చేరకుండానే సాయంత్రానికల్లా తనువు చాలించాడు.

అతని శరీరాన్ని గుంట తీయించి రాజు పూడ్పించాడు. అపుడు రాజు అనుకొన్నాడు.. ఆరడుగులు భూమి మనిషికి చాలని !

టాల్ స్తాయ్ వ్రాసిన ఈ కథ లో పోలిన వ్యక్తులు నేడు శక్తులు గా మారి ప్రజా కంఠకులయ్యారు ….
ఇటువంటి దురాశ. దుర్నీతి పరులతో . జాగ్రత్తండీ . జాగ్రత్త !!

– జి వి రామ్ ప్రసాద్
విజయవాడ