– 40 వాటర్ ప్రెషర్ పంపులు పంపిణీ
గుంటూరు, మహానాడు: విజయవాడ వరద ప్రభావిత బాధితులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ అండగా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపుగా 13 లక్షల రూపాయలు అందించారు. తాజాగా ఇళ్ళలో పేరుకుపోయిన బురద తొలగించేందుకు అవసరమైన 40 వాటర్ ప్రెషర్ మెషీన్లను అగ్నిమాపక శాఖకు అందించి, మేము సైతం అంటూ గుంటూరు వైద్యులు అండగా నిలిచారు. స్థానిక గుంటూరు మెడికల్ హాలు నుంచి మెషిన్ లను లారీలలో విజయవాడ లోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ కు స్వయంగా ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ ఏపి అధ్యక్షులు( ఎలక్ట్ )డాక్టర్ నంద కిషోర్ మాట్లాడుతూ విజయవాడ కు ఊహించనంత వరద వచ్చింది అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మావంతు సాయం అందించేందుకు ముందుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కె. కృష్ణారెడ్డి ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ నూతక్కి శ్రీనివాస్, డాక్టర్
వెలాగా మహేష్, తదితరులు పాల్గొన్నారు.