– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఉయ్యూరు నగర పంచాయతీ పదమూడో వార్డులో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వందరోజుల కూటమి ప్రభుత్వ పాలన లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఏర్పడిన దారుణ పరిస్థితులను అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలైన సామాజిక భద్రత పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్ ల పునఃప్రారంభం, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు వంటి హామీలను అమలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల చేత శభాష్ అనిపించుకుందని అన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి, వార్డు కౌన్సిలర్ పైలా శ్రీను, టీడీపి నాయకులు బూరెల నరేష్, మీసాల అప్పల నాయుడు, జగరోతు లక్ష్మణ, పామర్తి శివ, జనసేన నాయకులు గిరిడి వెంకటేష్, మహాలక్ష్మి, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.