తుపాను బాధితులకు సహాయార్థం

మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ నేత చిగురుపాటి సాంబశివరావు రూ.5 లక్షల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గురువారం అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సాంబశివరావు స్వగ్రామం గుడి గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అలాగే, గుడిపూడి గ్రామ టీడీపీ నేతలు లగడపాటి గజానన, గద్దె అప్పారావు, అచ్యుతరావు, కొనకంచి పుల్లారావు, గోపాలం తాతారావు, బండారుపల్లి సాంబశివరావు, గద్దె ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు, డ్వాక్రా మహిళలు దాదాపు రూ. 6 లక్షల విలువైన వస్తు సామగ్రిని సీఎంకు అందజేశారు.