చర్లపల్లో..ఎర్రగడ్డనో జనం తేలుస్తారు

– జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ సీఎం జగన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పేపర్ చూడకుండా మాట్లాడలేడని ఎద్దేవా చేశారు‘‘ పేపర్ చూడకుండా ఒక్క నిమిషం కూడా చదవలేని వారు, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునేవారు ఇవాళ సిద్ధం అట ప్రగల్భాలు పలుకుతున్నారు. దోపిడీ దొంగలు, ఆర్ధిక నేరస్తులు, అబద్ధాలకోరులకు జరుగుతున్న పరిణామాలు చూసి ఫ్యూజలు ఎగిరినట్టున్నాయి. ఎర్రగడ్డనో, చర్లపల్లో నెలరోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు’’ అని వ్యంగ్యాస్త్రం సంధించారు.