– వైసీపీ రాక్షస పాలనపై ప్రజలు యుద్ధం చేసి గెలిచారు
– 2024 ఎన్నికలు ఓ స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేశాయి
– పదవులు, అధికారం శాశ్వతం కాదు..మీ ప్రేమాభిమానాలే శాశ్వతం
– నారాయణపురం తండా ముఖాముఖిలో భువనమ్మ వ్యాఖ్య
కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, నారాయణపురం తండా గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి
నారాయణపురం తండా: ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదేళ్లలో నరరూప రాక్షసులను చూశారని, రాక్షసుల చేతిలో నలిగిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా 3వ రోజు రామకుప్పం మండలం, నారాయణపురం తండాలో భువనేశ్వరి పర్యటించారు.
మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భువనమ్మ మాట్లాడుతూ…. వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకునేందుకు 5ఏళ్లు కేటాయించారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు వైసీపీ నేతలు ద్రోహం చేశారు..అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలపై ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు.
ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ పాలనలో ఊచకోత కోశారు, అక్రమ కేసులతో జైళ్లలో మగ్గబెట్టారు. చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేయాలా అని ఆలోచిస్తారు..కానీ గత పాలకులు ఎలా దోచుకోవాలి అని ఆలోచించారు…అందుకే 2024 ఎన్నికల్లో వారిని చిత్తు చిత్తుగా ఓడించారు.
వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ప్రాథమిక హక్కులు కోల్పోయారు. అదేవిధంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోల్పోయారు. 2024 ఎన్నికలు ఓ స్వాతంత్ర్య సంగ్రామాన్ని తలపించేలా జరిగాయి.ఈ సంగ్రామంలో రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేశారు.వైసీపీ పాలన ముగిసేనాటికి రాష్ట్ర ఖజానాలో పైసా కూడా మిగల్చలేదు…అప్పులు మిగిల్చి వెళ్లారు.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు పెన్షన్లను పెంచి, ఇంటింటికీ అందేలా చర్యలు తీసుకున్నారు. లక్షలాది మంది మొఖాల్లో చిరునవ్వు చూశారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా ఏమేమి చేయాలో చంద్రబాబు చేయడానికి కష్టపడుతున్నారు.
వైసీపీ పాలనకు సంబంధించిన ఏ ఫైల్ ముట్టుకున్నా అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే మరో 5నెలలు పట్టేలా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలి.రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారు.
కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, ప్రత్యేక మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేస్తారు.చంద్రబాబును 8సార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు నా ధన్యవాదాలు.మా కుటుంబంపై మీరు పెట్టుకున్న నమ్మకానికి, మీరు చూపిస్తున్న ప్రేమకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం…మీ రుణం తీర్చుకుంటాం. అందుకే నేను మీ ముందుకు వచ్చాను.
పదవులు, అధికారం శాశ్వతం కాదు…మీ ప్రేమాభిమానాలే ముఖ్యం…మీ సంక్షేమం, అభివృద్ధే మాకు ముఖ్యం. కుప్పం నియోజకవర్గ మహిళల రుణం తీర్చుకునేందుకు మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. మీకు ఏ సమయంలో అయినా అండగా ఉంటాను.
మీరు ఎన్నుకున్న మీ నాయకుడు ఏ సమయంలో తలుపుతట్టినా మీకోసం సిద్ధంగా ఉంటారు..ఆయనకు మీరంటే అంత అభిమానం, ప్రేమ.కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.