పుంగనూరు కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

– హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక

అమరావతి, మహానాడు: పుంగనూరుకు చెందిన చిన్నారి కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పుంగనూరులో బాలిక హత్య కేసులో పురోగతి కనిపించింది. బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు భరోసా అందించాల్సిన సమయంలో మరింత బాధపెట్టడం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే..

చిన్నారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు మంత్రులు ఫరూఖ్, రాంప్రసాద్ రెడ్డి, నేను, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి వచ్చాం. గడిచిన ఐదేళ్లలో అత్యాచార, హత్యాచార నిందితులపై చర్యలు శూన్యం.. బాధితుల గోడు ఏనాడూ పట్టించుకోని నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి. చావుల్ని సైతం రాజకీయాలకు వాడుకొనేది వైఎస్సార్సీపీ. సంఘటన జరిగిన వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు .. చిన్నారిని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించేందుకు 12 బృందాలు, క్లూస్ టీంలు, డాగ్ స్క్వేడ్లు ఏర్పాటు చేశాం. అయితే, దురదృష్టవశాత్తు చిన్నారి శవం స్టోరేజ్ ట్యాంకులో తేలడం అత్యంత బాధాకరం. చిన్నారి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం. ఘటన జరిగిన వెంటనే ముగ్గురు నిందితులను పట్టుకున్నాం.. అతి కూటమి ప్రభుత్వ విధానం. ఎస్సార్సీపీ నేతలు అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు.

జగన్ వచ్చి పరామర్శించి వెళితే మాకు ఏ ఇబ్బంది లేదు..రాజకీయం చేయాలని చూస్తే ఊరుకోం. గడిచిన ఐదేళ్లలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే జగన్ చేసిందేమిటి? చిన్నారి ఘటన విషయంలో పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నాం. తమ కూతుర్ని హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు. నిందితులకు శిక్షపడేలా చేస్తాం. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటాం. 100 రోజుల పాలనలో గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి నిర్మూలించే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. గంజాయిపై సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేశాం.