రాజుపాలెం, మహానాడు: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఓ వ్యక్తి పై కేసు నమోదైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ.. అలిపిరిలో పోయినసారి వెంకటేశ్వర స్వామి కాపాడాడు, మరోసారి ఎవరూ కాపాడలేరు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చంద్రబాబుని ఉరితీయాలి అని మాట్లాడాడు. చంద్రబాబు పైన పదేపదే మాట్లాడే ఇతని మీద కేసు పెట్టి విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలి అని యాదవ సంఘం, తెలుగు యువత ఆధ్వర్యంలో రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
								