హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో జీవో వాస్కులర్ ఆసుపత్రి ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏఐ సహాయంతో వేరికోస్ వెయిన్ చికిత్సలను ఈ ఆసుపత్రులే ప్రవేశపెట్టాయి. జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి జానా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
జీవో ఆసుపత్రులు, రాష్ట్రంలో కొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికేలా వైద్య రంగంలో మరింత పురోగతికి దోహదపడుతున్నాయని ప్రసంశలు అందుకున్నాయి అని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. వాస్కులర్ వైద్య నిపుణుడు డాక్టర్ సంపత్ వాదిత్య మాట్లాడుతూ, ఏఐ వలన వేరికోస్ వెయిన్ చికిత్సల్లో శస్త్రచికిత్స ఖచ్చితత్వం మరింతగా పెరిగింది. రోగుల ఆరోగ్య ఫలితాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి అని తెలిపారు. ఈ ఆసుపత్రులలో వైద్యురాలు డాక్టర్ సువర్ణ, వైద్య నిపుణులు, ప్రముఖులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.