ప్రమాద బీమాగా ఆదాయ పన్ను రిటర్న్‌

హైదరాబాద్, మహానాడు:  మీరు వరుసగా మూడు సంవత్సరాలు ఆదాయపు పన్ను రిటర్న్‌లను చేసినట్లయితే ప్రమాద బీమాగా ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ చేసిన వ్యక్తి  ప్రమాదవశాత్తు మరణిస్తే రిటర్నులు చేసిన దానికి పది రెట్లు ఆ కుటుంబం లబ్ది పొందే అవకాశం ఉంది. ఒక వ్యక్తి గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి ఉంటే, ఆ వ్యక్తి కుటుంబానికి గత మూడేళ్లుగా అతని సగటు వార్షిక ఆదాయానికి పది రెట్లు మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అవునా! అని ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది నిజం. అందుకు ప్రభుత్వ నిబంధనలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు ఓక వ్యక్తి వార్షిక ఆదాయం ఐదు లక్షలు ఉంటే దానికి పదిరెట్లు అంటే యాభై లక్షల రూపాయలు ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నుండి డబ్బు పొందే హక్కు ఉంది. ఈ  సమాచారం తెలియకపోవడంతో చాలామంది ప్రభుత్వం నుండి ఈ క్లెయిమ్‌ను తీసుకోరు. అంటే వరుసగా మూడు సంవత్సరాలు రిటర్నులు దాఖలు చేయకపోతే ఆ కుటుంబానికి డబ్బు రాదని కాదుగానీ, అలాంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 1.5 లక్షలు కోల్పోతారు. చాలా మంది రిటర్న్‌లు దాఖలు చేయని కారణంగా ఈ లబ్ధిని పొందలేరు. న్యాయవాది మనీష్ డి.కుమావత్ మాట్లాడుతూ మోటార్ చట్టం, 1988 లోని సెక్షన్ 166 (2013 సివిల్ అప్పీల్ నం. 9858 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు, SLP (C) నం. 1056 ఆఫ్ 2008) Dt 31 అక్టోబర్ 2013 ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్‌ చేసిన వ్యక్తికి  ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు.