మెడికల్ క్యాంపుల సంఖ్య పెంచండి

– మంత్రి గొట్టిపాటి ఆదేశం

అమరావతి, మహానాడు: దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా తగ్గుముఖంపట్టే వరకు మెడికల్‌ క్యాంపుల సంఖ్య పెంచాలని ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ కాలనీలో డయేరియాతో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. మరణాలపై పల్నాడు కలెక్టర్ తో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని, డయేరియా లక్షణాలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, సంబంధిత ప్రాంతాల్లో బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ ముమ్మరం చేయాలని, డయేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ కు మంత్రి గొట్టిపాటి సూచించారు.